మొలకల పౌర్ణమి(Stub Festival)
- Connected Indian
- May 7, 2020
- 1 min read
ఉద్ధేశ్యం:- సకాలంలో వర్షాలు పడి పంటలు పండాలని చేసుకుంటారు.
మొలకల పౌర్ణిమ దక్షిణ భారతదేశంలో పల్లె ప్రాంతాలలో జరుపుకునే పురాతన పండుగ.
11 రోజుల ముందు నుండీ ఐదు రకాల ధాన్యాలను మట్టి కుంపటిలో నానబోసి ప్రతిరోజూ పూజ చేస్తూ పెంచుతూ వస్తారు. ఇది వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ తంతు మొదలై, పౌర్ణమి రోజున(అనగా ఈ రోజు మే 7వ తేది 2020) ఊరంతా ముఖ్యంగా ఇద్దరు దైవాలకు(గ్రామ దేవత మరియు కుల దైవం) ఈ మొలకలను సమర్పించి పూజ చేయడం జరుగుతుంది.
సకాలంలో వర్షాలు కురిసి పంటలను రక్షించమని ప్రార్థించడం జరుగుతుంది. మట్టి కుంపటిలో తీసుకెళ్లిన మొలకలను పూజ తర్వత అక్కడే విడిచి రావడం జరుగుతుంది.
చాలా వరకూ ఈ పూజను పొలం మధ్యలో వుంచిన దేవతల దగ్గర చేసుకుంటారు.
ప్రకృతికి దగ్గరగా జరుపుకంనే పండుగలలో మొలకల పౌర్ణమి కూడా ఒకటి.

Komentāri