ఎవరు సాక్ష్యం(Wild Witness)
- Connected Indian
 - May 8, 2020
 - 1 min read
 

కనులకు చెవులు
చెవులకు కనులు
ఆపాదించబడినప్పుడు
ఎవరు ఎవరికి సాక్ష్యం?
తనకు తానే సాక్ష్యమని
తనువు తనకు సాక్ష్యమని
నీలో నీవే నిలబడలేవు
అడవిమనిషివో
పట్టణవాసివో
నీలో నీవే కనబడవు
నీకు నీవే కనుమరుగవుతుంటావు
రూపం మోహం
రుచుల విన్యాసం
గాఢాంధకారం
గగన వికాసం
దేనికి ఏది సాక్ష్యం
కలలకు సాక్ష్యం నీ కన్నులయినా
కదలని తెరపై బొమ్మవు నీవే!
కలలు సాధించి
తనువు చాలించినా
అక్షర సాక్ష్యాలు
అంబర దీపాలై
జనం మనం
జగమంతా నీవై
నీవు జగత్తుకే సాక్ష్యం!!





Comments